India Post Payments Bank launched successfully in Hindupur Division on 01.09.2018
Departmental SB Self Verification deadline ends on 07.09.2018 Government announced additional Dearness Allowance of 2% w.e.f 01.07.2018

Pages

Friday, March 24, 2017

Hindupur Postal Recreation Club Kurnool Region - Divisional Level T20 Cricket Tournament and Badminton (Doubles) Tournament,2017



హిందూపురం పోస్టల్ రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో డివిషనల్ లెవెల్ (కర్నూలు రీజియన్) క్రికెట్ మరియు బాడ్మింటన్ (డబుల్స్) టోర్నమెంట్ – 2017
****************************************************************
ప్రియమైన సహోద్యోగులరా,        
            మన కర్నూలు రీజియన్ లో ఉన్న ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించడానికి మరియు మన అనునిత్య పని ఒత్తిడి నుండి పునరుత్తేజం పొందడానికి ఆహ్లాదకరమైన వాతావరణంలో హిందూపురం డివిజన్ నందు మొట్టమొదటిసారిగా హిందూపురం రిక్రియేషన్ క్లబ్ గౌరవ అధ్యక్షులు శ్రీ బి. మొహమ్మద్ ఇస్మాయిల్, సూపరింటెండెంట్, తపాలా శాఖ, హిందూపురం డివిజన్ వారి  ఆధ్వర్యంలో హిందూపురం పోస్టల్ రిక్రియేషన్ క్లబ్ సభ్యులచే ఏప్రిల్ 14,15,16 తేదీలలో హిందూపురం నందు డివిషనల్ లెవెల్ (కర్నూలు రీజియన్) T-20 క్రికెట్ మరియు బాడ్మింటన్ (డబుల్స్) టోర్నమెంట్ నిర్వహించబడును.    ఈ టోర్నీలో పాల్గొనుటకు ఆసక్తిగలవారు వెంటనే తమ తమ జట్లను నమోదు చేసుకోగలరు.
            టోర్నీ జరుగు మూడు రోజులు పాల్గొన్న జట్టు సభ్యులకు భోజనము మరియు వసతి సదుపాయములు కల్పించబడును.
టోర్నమెంట్ వివరములు /సూచనలు:
T-20 క్రికెట్:
v  ప్రతి మ్యాచ్ ఇన్నింగ్స్ కు 20 ఓవర్లతో కొత్త 4-పీస్ లెదర్ బాల్ తో నిర్వహించబడును. ప్రతి మ్యాచ్ హిందూపురం పట్టణము లోని S.D.G.S కళాశాల/ M.G.M గ్రౌండ్ ల నందు నిర్వహించబడును.
v  జట్టుకు 15 మంది సభ్యులు మించకుండా జాబితాను ముందుగానే కార్యనిర్వాహకులకు అందజేయవలెను. డిపార్ట్మెంట్ మరియు జిడియస్ ఉద్యోగులు మాత్రమే జట్టులో సభ్యులుగా ఉండవలెను. అట్లు లేని  పక్షాన ఆ జట్టు ను టోర్నీకు అనర్హులుగా ప్రకటించబడును.
v  ప్రతి జట్టు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించవలెను మరియు తమ కిట్లను తామే తీసుకు రావలెను.
v   మ్యాచ్ లలో అంపైర్ లదే తుది నిర్ణయం. అంపైర్ లుగా BCCI Level-1  మరియు ఆంధ్ర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అంపైర్ లు వ్యవహరించెదరు.
v  ప్రవేశ రుసుము - జట్టుకు Rs.3000/- మాత్రమే. 
బాడ్మింటన్ (డబుల్స్):
v  ప్రతి మ్యాచ్ ను హిందూపురం పట్టణము లోని ఇన్డోర్ స్టేడియంలలో  సాయంత్రం 6 గంటల నుండి నిర్వహించబడును.
v  ప్రతి మ్యాచ్ YONEX MAVIS 350 shuttle తో నిర్వహించబడును.
v  ప్రతి జట్టు తప్పనిసరిగా తమ కిట్లను తామే తీసుకు రావలెను
v  ప్రవేశ రుసుము - జట్టుకు Rs.500/- మాత్రమే
            ఆసక్తిగలిగిన వారు తమ జట్టు వివరాలను (జట్టు పేరు, సభ్యులు , డివిజన్) “hindupurhunters@gmail.com ”మెయిల్ కు అందజేసి ప్రవేశ రుసుమును ఏప్రిల్ 3, 2017 లోపు POSB అకౌంట్ నెంబర్ 1126027605 (A/C Holder:  N.Girish / E.S.Venkata Kishore)  లో తగిన Deposit Remarks (టీం పేరు/సభ్యుడి పేరు)తో డిపాజిట్ చేసి తమ జట్టును నమోదు చేసుకోగలరు. ఎటువంటి పరిస్థితులలోను చెల్లించిన ప్రవేశ రుసుము తిరిగి ఇవ్వబడదు. ఏప్రిల్ 5, 2017 Fixtures ను విడుదల చేయబడును. విజేత (మొదటి, రెండవ) జట్లకు, టోర్నీ ఉత్తమ బాట్స్మన్ మరియు బౌలర్ లకు బహుమతుల ప్రధానోత్సవంతో ఏప్రిల్ 16 న టోర్నమెంట్ ముగియును.
            మరిన్ని వివరాల కొరకు క్రింద తెలిపిన ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు.

Committee Head (Chairman) :

v Sri B.Mohammad Ismail, Supdt. of Post Offices, Hindupur Division

Committee Members:

v Sri G.V.Sreenivasulu, ASP(HQ), Hindupur Division
v Smt. J.N.Vasantha, ASP, Hindupur Sub Division
v Smt. B.Vasavi, Inspector Posts, Dharmavaram Sub Division
v Sri C.Kalyan Ram, Inspector Posts, Penukonda Sub Division
v Sri G.Janardhan Reddy, Inspector Posts, Kadiri Sub Division
v Sri Tarun Kumar Meena, IPOC, Hindupur Division
v Sri A.Markandeya, Postmaster, Hindupur HO
v Sri C.Jayaramulu, Postmaster, Dharmavaram HO
v Sri N.Sreenivasulu, PA, SBCO, Dharmavaram HO

Contact Details:

v Sri N.Girish, DSA, %SPOs, Hindupur Dn  Mobile No: 8328301640
v Sri P.S.Abinay, OA, %SPOs, Hindupur Dn Mobile No: 8555896807
v Sri M.Harinath, OA, %SPOs, Hindupur Dn Mobile No: 9885962918
v Sri K.Vimal Kumar, OA, %SPOs, Hindupur Dn Mobile No: 8125245976
v Sri E.S.V. Kishore, Treasurer, Hindupur HO Mobile No: 9440890840
v Sri P.S.Narendra Babu, PA, Hindupur HO Mobile No: 8179613137


                                                                                                                                                                ఇట్లు
                                                                                                                                                పోస్టల్ రిక్రియేషన్ క్లబ్స్

                                                                                                                                                      హిందూపురం

No comments:

Post a Comment